నేను చెప్పిందే వైసీపీ అనుసరించాల్సి వస్తోంది: చంద్రబాబు
అమరావతి : కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి బాబు నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో హాయిగా బతికిన ప్రజలు.. ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ ఉండడం జగన్నాటకమేనని.. వైసీపీ నేతల ఇసుక దోపిడీ జగన్‌కు తెలియడం లేదా? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు.
నేను చెప్పిందే అనుసరించాల్సి వస్తోంది 'వరదల వల్ల ఇసుక కొరత అనడం అబద్ధం. ఇసుక పాలసీ మార్చకుండా ఉంటే రాష్ట్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకునేవారు కాదు. 8 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశారు.. అది టీడీపీ దూర దృష్టి. ఇరిగేషన్‌లో మీకు ఓనమాలు రావని జగన్‌కు చెప్పాం. ఇప్పుడు నేను చెప్పిందే అనుసరించాల్సి వస్తోంది. దేశంలో రైతురుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీనే. ప్రభుత్వంగా బాండ్లు ఇచ్చాం.. గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రూ.12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వడం లేదో చెప్పాలి' అని జగన్ ప్రభుత్వంపై బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
నేను చెప్పిందే వైసీపీ అనుసరించాల్సి వస్తోంది: చంద్రబాబు